Logo

NI KRUPA

Place : KANCHARPALEM, Date : 09 Jun 2026

4 బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి, పాప క్షమాపణనిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను.5 అంతట యూదయ దేశస్థులందరును యెరూషలేమువారందరును బయలుదేరి అతని యొద్దకు వచ్చి, తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి.6 యోహాను ఒంటె వెంట్రుకల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొని, మిడతలను అడవి తేనెను తినుచుండెను.7 మరియు—నాకంటె శక్తిమంతుడైనవాడు నా వెనుక వచ్చుచున్నాడు; ఆయన చెప్పుల వారును వంగి విప్పుటకు నేను పాత్రుడను కాను.8 నేను నీళ్లతో మీకు బాప్తిస్మమిచ్చితిని, ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తిస్మమిచ్చునని ప్రకటించుచుండెను.9 ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చి, యొర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మము పొందెను.